దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ క్రేజీ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’ రిలీజ్ డేట్ ఖరారైంది. రణ్బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ 2027 జనవరి 21న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భార్యాభర్తలు రణ్బీర్,అలియా కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.