టాలీవుడ్ సమ్మర్ బాక్సాఫీస్ ఈసారి బోసిపోయింది. పెద్ది, ది ప్యారడైజ్, టాక్సిక్, విశ్వంభర వంటి ప్రాజెక్టులు వాయిదా పడటంతో దాదాపు రూ.3000 కోట్ల నష్టం వాటిల్లిందని టాక్. థియేటర్లు ఖాళీగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే, చిన్న సినిమాలు సంచలనం సృష్టిస్తే తప్ప టాలీవుడ్ కోలుకోవడం కష్టం. భారీ మూవీల రాకతోనే మళ్లీ కళ వస్తుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.