‘యానిమల్’ మూవీ బాలీవుడ్లో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ కాలాన్ని మళ్లీ తెచ్చిందని అక్షయ్ కుమార్ అన్నాడు. అమితాబ్ కాలం నాటి కోపానికి ఒక పరిమితి ఉండేదని, కానీ సందీప్ వంగా ఆ హద్దులను చెరిపేసి 10 రెట్లు ఎక్కువ తీవ్రతతో చూపించారని ప్రశంసించాడు. బాబీ డియోల్ పాత్రను మర్చిపోలేనన్న ఆయన, ఇప్పుడు ప్రేక్షకులు కేవలం కొరికే హీరోనే కాదు, పదిసార్లు పొడిచే హీరోని కోరుకుంటున్నారని తెలిపాడు.