పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ వి.వి. వినాయక్ కాంబోలో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీనిపై వినాయక్ స్పందిస్తూ.. పవన్‌తో సినిమా చేయాలనే బలమైన కోరికతో ఒక కథను సిద్ధం చేసి, కొన్ని రోజులు వర్క్ కూడా చేశానని వెల్లడించాడు. కానీ అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని అన్నాడు.