ఎ.కె జంపన్న దర్శకత్వంలో వరుణ్ సందేశ్, కాశికా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కాస్ట్’. ఈ సినిమాలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగబాబు ‘రంగరాజన్’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. నాగబాబు నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు వెల్లడించారు.