నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2026 మే 22న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఏకంగా 2:51 గంటల నిడివితో రాబోతున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.