‘జన నాయగన్’ మూవీ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా అనేది ఎంతోమంది శ్రమ, కలల సమాహారమని, ఇలాంటి ఘటనలు పరిశ్రమను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. క్రియేటివ్ వర్క్‌ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ విషయంలో కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు అండగా ఉంటామని, దోషులను శిక్షించడంలో చిత్ర పరిశ్రమ ఏకతాటిపై నిలుస్తుందని వెల్లడించారు.