‘డెకాయిట్’పై నేచురల్ స్టార్ నాని ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఈ మూవీ మనసును హత్తుకునే నిజమైన బ్లాక్ బస్టర్ అని, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ కావొద్దని తెలిపాడు. అడివి శేష్, మృణాల్ నటన అద్భుతంగా ఉందని, రచన, స్క్రీన్ప్లే విభాగం పనితీరు బాగుందన్నాడు. ఈ ఏడాదిలోని గొప్ప చిత్రాల్లో ఇదీ ఒకటిగా నిలిచిపోతుందని చెప్పాడు. దీనిపై స్పందించిన శేష్.. నానికి థ్యాంక్స్ చెప్పాడు.