నందమూరి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ తన ఐకానిక్ చిత్రం ‘ఆదిత్య 369’కి సీక్వెల్గా రాబోతున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’తోనే మోక్షజ్ఞను పరిచయం చేయనున్నట్లు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని సమాచారం.