కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా విడుదలపై వస్తున్న వార్తలకు మేకర్స్ ముగింపు పలికారు. ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందనే ప్రచారంలో నిజం లేదని, ముందుగా నిర్ణయించినట్లుగానే జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్లో కియారా అద్వానీ, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు.