నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో ‘NBK 111’ రాబోతుంది. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే రెండు అద్భుతమైన ట్యూన్స్‌ను ఆయన సిద్ధం చేసినట్లు సమాచారం. రచయిత అనంత్ శ్రీరామ్ ఒక పాట కోసం సాహిత్యం అందించాడట. HYDలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాట చిత్రీకరణ జరగనున్నట్లు టాక్. సాంగ్ షూట్ పూర్తయిన వెంటనే, అదే ప్రదేశంలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట.