నేచురల్ స్టార్ నాని కెరీర్లో ‘జెర్సీ’ ఒక మైలురాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ క్లాసిక్ నేటికి ఏడేళ్లు పూర్తి చేసుకుంది. విఫలమైన ఓ క్రికెటర్ తన కొడుకు జెర్సీ కోసం పడ్డ తపన, పోరాటం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. అనిరుధ్ సంగీతం, నాని నటన ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డు స్థాయికి తీసుకెళ్లాయి. అర్జున్ పాత్ర నేటికీ ఎందరికో స్ఫూర్తిదాయకం.