‘KGF 3’ గురించి కన్నడ స్టార్ యష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రస్తుతం నా దృష్టంతా టాక్సిక్, రామాయణ చిత్రాలపైనే ఉంది. అందుకే ఇప్పుడు మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం లేదు. అయితే, దర్శకుడు ప్రశాంత్ నీల్, నేను ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాం. కథ గురించి చర్చిస్తూనే ఉంటాం. సరైన కథ కుదిరిన వెంటనే ఖచ్చితంగా KGF 3 ఉంటుంది’ అని చెప్పడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.