‘డెకాయిట్’ తన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమని నటుడు అడివి శేష్ సంతోషం వ్యక్తం చేశాడు. నిరంతరం థ్రిల్లర్లు చేసే తాను, తొలిసారి స్వచ్ఛమైన ప్రేమకథను నిజాయతీగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశానన్నాడు. జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా ప్రత్యేకంగా చూపించాలనే తపనతోనే ‘డెకాయిట్’ రూపుదిద్దుకుందని తెలిపాడు.