ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న ‘రాకా’ చిత్రంపై ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా, సైన్స్ ఫిక్షన్, మైథాలజీ కలయికతో ఉండబోతుందట. ముఖ్యంగా ‘తోడేళ్లు’ నేపథ్యంలోని పురాణ రహస్యాలను ఈ కథలో కీలకంగా వాడుతున్నట్లు సమాచారం. బన్నీని ముందెన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో చూడబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.