1996 నేపథ్యంలో సాగే ‘తిమ్మరాజుపల్లి TV’ పల్లెటూరి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. రాజప్ప కొన్న టీవీ చుట్టూ ఊరి వినోదం, సతీష్-శారదల ప్రేమకథ తిరుగుతుంది. టీవీ చోరీకి గురవ్వడం, ఆ నింద సతీష్‌పై పడటంతో కథ మలుపు తిరుగుతుంది. దొంగను పట్టుకునే క్రమంలో వచ్చే మలుపులు, ద్వితీయార్ధం సినిమాకు ప్లస్. బలమైన సంఘర్షణ లోపించినా, నటీనటుల నటన మెప్పిస్తుంది. రేటింగ్: 2.75.