ప్రముఖ హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. చెన్నైలోని తేనాంపేట్ ప్రాంతంలోని త్రిష ఇంటిలో బాంబు పెట్టినట్లు దుండగులు.. పోలీసులకు మెయిల్ పంపించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమె ఇంట్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.