NLG: కట్టంగూరు మండలం ఇస్మాయిల్ పల్లి ఐకేపీ సెంటర్లో వడ్లు పోసి 25 రోజులైనా తాలు పేరుతో కోత విధిస్తూ కాంటాలు వేయకపోవడంపై రైతు సంఘం నేత కందాల ప్రమీల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరి బావుల వద్దే కాంటాలు వేస్తున్నారని, సామాన్య రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. అధికారులు స్పందించి, కోతలు లేకుండా కాంటాలు ప్రారంభించాలన్నారు.