సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా, క్రికెట్ నేపథ్యంలో సాగే ఓ రొమాంటిక్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హరిహరణ్ రామ్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో మాళవిక మనోజ్ హీరోయిన్గా నటించబోతుంది. ఈ మూవీ కోసం జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా క్రికెట్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.