ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అందుకే అప్ కమింగ్ ఫిల్మ్ కోసం ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు ఆడియెన్స్. అది కూడా శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 చేస్తుండడంతో.. మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకే కనీసం చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయినా రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్నప్పటికీ.. శంకర్ మాత్రం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. చాలా రోజులుగా ఆర్సీ 15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రాబోతోందని ఊరిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అది కూడా భారీ ఈవెంట్‌తో గ్రాండ్‌గా టైటిల్ లాంచ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ సారి కూడా అలాంటి న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. సంక్రాంతి కానుకగా ఆర్సీ 15 ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నరని తెలుస్తోంది. ఎప్పటిలాగే భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈసారి ఆర్సీ 15 ఫస్ట్ లుక్ రావడం ఖాయమంటున్నారు. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇకపోతే.. ఇటీవలె న్యూజిలాండ్‌లో చరణ్, కియారా అద్వానీలపై ఒక సాంగ్ షూటింగ్ చేశారు. రీసెంట్ షెడ్యూల్ రాజమండ్రిలో జరిగింది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, శ్రీకాంత్‌పై పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సీన్స్ తెరకెక్కించారు. ఇక RC 15 తాజా షెడ్యూల్ కర్నూలు కొండారెడ్డి బురుజు పరిసర ప్రాంతాలలో జరుగుతున్నట్టు తెలుస్తోంది.