విశాఖలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘జనతా వారధి’ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే కార్యాలయంలో అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు.