TPT: అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 100 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏఎస్వో లక్ష్మీనారాయణ రెడ్డి వివరాలు తెలియజేశారు. కలువాయి మండలం నుంచి బియ్యాన్ని అక్రమ మార్గాల్లో గూడూరుకు తరలించి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.