జగిత్యాలలోని 2BHK అర్బన్ కాలనీలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని సీపీఐ జిల్లా నాయకుడు వెన్న సురేశ్ మున్సిపల్ కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 4520 కుటుంబాలకు అంగన్వాడీ, పాఠశాలలు, ఆసుపత్రి, మార్కెట్ వంటి సదుపాయాల కోసం ఉన్న భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఆక్రమణలను తొలగించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.