రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల 126 రోజుల రాజకుమారి పరేఖ్.. సీఏ ఫైనల్ పరీక్షలో పాసై దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన చార్టర్డ్ అకౌంటెంట్‌గా రికార్డు సృష్టించారు. గతంలో నందిని అగర్వాల్ పేరిట ఉన్న రికార్డును ఆమె తిరగరాశారు. శ్రమ, అంకితభావంతో ఏ వయసులోనైనా అసాధ్యమైన లక్ష్యాలను సుసాధ్యం చేయవచ్చని ఆమె నిరూపించారు.