KDP: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మైదుకూరులో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జాతీయ రహదారులు 40, 67పై డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. వ్యతిరేక దిశలో వచ్చిన ఒక లారీని సీజ్ చేసి కోర్టుకు హాజరు పరిచారు.