మంచు మనోజ్ హీరోగా హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. ఈ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా రియాబోషప్కా హీరోయిన్గా నటిస్తుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. చిత్రబృందం తాజాగా ఆమె లుక్ను విడుదల చేసింది. ఇందులో ఆమె క్లారా పాత్రలో నటిస్తుంది. గతంలో శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ సినిమాలో మరియా హీరోయిన్గా నటించింది.