ప్రకాశం: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడిని ప్రజలంతా ఖండించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సయ్యద్ హనీఫ్ కోరారు. చంద్రశేఖరపురంలో మండల కమిటీ సమావేశంలో హనీఫ్ మాట్లాడుతూ.. చమురు సంపద కోసం అమెరికా యుద్ధానికి దిగిందని విమర్శించారు. ఈ దాడుల్లో పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా చర్యలను భారత ప్రభుత్వం ఖండించాలని డిమాండ్ చేశారు.