SKLM: బారువ మండలంలో నిర్మాణంలో ఉన్న 30 పడకల సామాజిక ఆసుపత్రిని ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త శ్యామ్ ప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి అప్పలరాజు శుక్రవారం పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రూ.6.55 కోట్లతో ప్రారంభమైన ఆసుపత్రి నిర్మాణం 80 శాతం పూర్తయ్యిందని వైసీపీ నాయకులు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు.