మేషం
మీ చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
వృషభం
పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది.
మిథునం
నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది.కీలక వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తవహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తి తో ఉంటారు.
కర్కాటకం
మీరు చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు తగ్గించుకోవాలి.ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు
సింహం
స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి సత్ఫలితాలు సాధిస్తారు. రాజకీయ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
కన్య
మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది.
తుల
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. మీరు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్నవిషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వృశ్చికం
మీరు తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. శుభకార్య ప్రయత్యాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు.
ధనుస్సు
మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.
మకరం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు లభిస్తాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుంతుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
కుంభం
చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండటంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. మీ వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు.
మీనం
మీరు చేసే పనుల్లో ఆలస్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ భాద్యతలు అధికమవుతాయి. విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోనివారికి ఆటంకాలు ఎదురవుతాయి.