కృష్ణా: గుడివాడ మండలం దొండపాడు గ్రామంలోని సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ఘంట శ్రీనివాసరావు సూసైడ్ చేసుకున్నాడు. మల్లాయిపాలెం టిడ్కో ఇళ్ల సమీపంలో గల రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు మృతి పట్ల, ఉద్యోగులు భావోద్వేగానికి లోనయ్యారు. సూసైడ్‌కు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన 24 గంటల గడువు ముగిసిందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జాఫర్ ఎక్స్‌ప్రెస్ నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది సైనికులను చంపేశామని ప్రకటించింది. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించడంతో తమ చేతులకు పని చెప్పామని వ్యాఖ్యానించింది.
KDP: మైదుకూరు మండలం కేశలింగాయపల్లె వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పి. చలమయ్య, లక్ష్మీదేవి దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మైదుకూరు పట్టణంలో నివాసం ఉంటున్న వీరు పొలం పనులు చూసుకుని తిరిగి వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రెండు లారీల మధ్య బైక్ నలిగి నుజ్జు అయింది. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పొరుగింటి వారితో గొడవ కారణంగా ఓ విశ్రాంత ఉద్యోగి కారుతో ఢీకొట్టి హత్యాయత్నంకు యత్నించాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మంగళూరుకు చెందిన విశ్రాంత ఉద్యోగి సతీష్ కుమార్‌కు పొరుగింట్లో ఉండే ప్రసాద్‌తో గతంలో గొడవైంది. దానిని మనసులో ఉంచుకుని బైక్‌పై వెళ్తున్న ప్రసాద్‌ను సతీష్ కారుతో ఢీకొట్టాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న మరో మహిళకు గాయాలయ్యాయి.
MDK: పెళ్లి సంబంధాలు కుదరడంలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. చిన్నశంకరంపేట మండలం మడూరుకు చెందిన ఫిరంగళ్ల శివరాజ్ (24) గురువారం రాత్రి పొలానికి నీళ్లు చూడడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శివరాజు తండ్రి యాదగిరి పొలం వద్దకు వెళ్లి చూడగా వేప చెట్టుకు ఉరివేసుకొని కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
TG: హైదరాబాద్ జీడిమెట్ల పీఎస్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ ట్రే గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో దట్టంగా పొగలు అలుముకోవడంతో.. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
AP: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల టీడీపీ అధ్యక్షుడు విజయగౌడ్ కారుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఉదయానికి కారు పూర్తిగా దగ్ధమైంది. దీనిపై విజయగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనక రాజకీయ కుట్ర ఉన్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
KRNL: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదోని మండల పరిధిలోని పాండవగల్లు గ్రామ సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు, బైక్‌లను ఢీకొంది. స్థానికుల వివరాల మేరకు.. గంగావతి డిపోకు చెందిన బస్సు ఆదోని నుంచి రాయచూరు వెళ్తూ.. ముందు వెళ్తున్న రెండు బైక్‌లను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.
KNR: గిద్దె పెరుమాండ్ల దేవస్థానం గ్రౌండ్లో పెను ప్రమాదం తప్పింది. సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో వ్యక్తి కారు నేర్చుకోవడానికి వచ్చారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ట్రాక్‌పై ఉన్న స్ట్రీట్ లైట్స్, పూలమొక్కలు, కుండీలను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వాకర్లు భయాందోళనకు లోనయ్యారు.
ATP: హిందూపురంలోని ఆటోనగర్‌లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 2- టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయాన్(14), హరిహన్(12) ఇద్దరు ఆటో నగర్‌లోని సడ్లపల్లి చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు.
MDK: శివంపేట మండలం సికింద్రాపూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గుండంలో పడి బాలుడు మృతి చెందాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద వారం వారం జరిగే ఉత్సవాలకు హైదరాబాద్ బాలాజీనగర్‌కు చెందిన కరుణాకర్ (14) కుటుంబం విచ్చేసింది. ఈ క్రమంలో ఆలయం వద్ద గుండంలో స్నానం చేసేందుకు దిగిన కరుణాకర్ మునిగి మృతి చెందాడు.
WNP: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రామన్ పాడు రిజర్వాయర్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మదనపూర్ మండలం రామన్ పాడు గ్రామానికి చెందిన వాకడి గిరి (45) ఆదివారం ఉదయం చేపల వేటకు రిజర్వాయర్‌లోకి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MBNR: ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది.
CTR: పుత్తూరు మండలం తడుకు సమీపంలో హైవేపై భారీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. శనివారం రాత్రి బస్సుని ఓవర్ టేక్ చేయబోయిన లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న హైవే కల్వర్టు గోడని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో లారీ భారీగా దెబ్బతింది. ఎవరికి ప్రాణనష్టం కలగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: పుంగనూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పురుషోత్తం ఓ ఫైనాన్స్‌లో పర్సనల్ లోన్ తీసుకున్నాడు. పర్సనల్ లోన్ ఈఎంఐ చెల్లించకపోవడంతో శ్రీరామ ఫైనాన్స్ ఉద్యోగి నందీశ్ గ్రామానికి వెళ్లి డ్యూలు కట్టాలని అడగగా, మాటామాటా పెరిగి పురుషోత్తం వేట కొడవలితో నందీశ్‌పై దాడి చేయడంతో గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తుచేసి కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.