AP: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళులో విషాదం నెలకొంది. గణేష్ నిమజ్జన ఊరేగింపులో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు తూర్పుతాళ్లుకు చెందిన సూర్యనారాయణ, మురళీ, నరసింహమూర్తి, దినేష్‌గా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
KMR: పాల్వంచ మండలం పోతారం గ్రామానికి చెందిన ఉప్పల్వాయి నారాయణ(70) ఆదివారం చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృతి చెందారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు మాచారెడ్డి ఎస్సై అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చెరువులు, వాగుల వద్ద చేపలు పట్టడం, లేదా సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదకరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూచించారు.
ELR: ఏలూరు వైఎస్ఆర్ కాలనీకి చెందిన పోడూరి రాజేష్ (42) ఆదివారం హత్యకు గురయ్యాడు. ఇంట్లో భోజనం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి రాజేశ్‌ను పని ఉందని బయటకు పిలిచి కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన అతన్ని ఏలూరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా: అవనిగడ్డలో ఆదివారం సాయంత్రం 30 ఎకరాల వరిగడ్డి వామి దహనమైంది. నివాస గృహాల మధ్య ముగ్గురు రైతులకు చెందిన గడ్డివామి ఒక్కసారిగా తగలబడటంతో స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పి ప్రమాద తీవ్రతను అదుపు చేశారు. ఘటనపై రైతు రంగారావు మాట్లాడుతూ.. ఎవరో కావాలని తగులబెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా: అవనిగడ్డలో ఆదివారం సాయంత్రం 30 ఎకరాల వరిగడ్డి వామి దహనమైంది. నివాస గృహాల మధ్య ముగ్గురు రైతులకు చెందిన గడ్డివామి ఒక్కసారిగా తగలబడటంతో స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పి ప్రమాద తీవ్రతను అదుపు చేశారు. ఘటనపై రైతు రంగారావు మాట్లాడుతూ.. ఎవరో కావాలని తగులబెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
VSP: విశాఖపట్నం సమీపంలోని రుషికొండ బీచ్‌లో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు పర్యాటకులు సముద్ర స్నానానికి వెళ్లి అలల ఉద్ధృతికి కొట్టుకుపోతుండగా.. అప్రమత్తమైన లైఫ్‌గార్డ్స్ వారి ప్రాణాలను కాపాడారు. బస్సులో వచ్చిన 15 మంది యువతీ, యువకులు గల బృందం రుషికొండ బీచ్‌ను సందర్శించారు.
MBNR: బాలానగర్ మండలంలోని అప్పాజీపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ బాలానగర్ వస్తుండగా గౌతాపూర్ గ్రామ సమీపంలో బైకు అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ సంఘటనలో ప్రభాకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు స్పందించే వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని బాధితులని ఆసుపత్రికి తరలించారు
RR: సిమెంట్ మిల్లర్ లారీ బోల్తా పడిన ఘటన ఆదివారం షాద్‌నగర్ పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. దూసుకల్ జేపీ దర్గా డబుల్ బెడ్ రూమ్స్ సమీపంలో సిమెంట్ మిల్లర్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్: కూకట్‌పల్లిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. APలోని తుని నుంచి గంజాయిని తీసుకొచ్చి కూకట్‌పల్లిలోని ఒక హాస్టల్ గదిలో ఉంచి విక్రయిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి 1.109kgల గంజాయి, రెండు స్కూటీలు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
WGL: జిల్లా మహబూబ్ నాయక్ తండాకు చెందిన మాలోతు వీరన్న (46) మూర్ఛ వ్యాధితో మనస్తాపానికి గురై శనివారం ఉదయం బావి వద్ద గడ్డిమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే నర్సంపేట ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అతను మృతి చెందాడు. కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మేడ్చల్: KPHB PS పరిధిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక భర్త రామకృష్ణను భార్య రమ్య కృష్ణ గొంతు కోసి.. అనంతరం తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TG: HYD కేపీహెచ్‌బీ కాలనీలో దారుణం జరిగింది. అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తొలుత భర్త రామకృష్ణ గొంతు కోసి అతడి భార్య చంపేసింది. అనంతరం తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రమ్యకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లా మహోర్లోఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి ఓ నివాస భవనంపై పడటంతో ఏడుగురు మృతి చెందారు. మరోవైపు, రాంబన్ జిల్లా రాజ్‌గఢ్‌లో క్లౌడ్‌బరస్ట్ సంభవించడంతో వరదలు సంభవించాయి. ఆ వరదల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నాయి.
HYD: అంబర్‌పేట పటేల్‌నగర్‌లో రాజు కుటుంబం నివాసముంటోంది. శుక్రవారం సాయంత్రం చిన్న కుమారుడు రెండో అంతస్తు బాల్కనీలో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
AP: విశాఖలోని శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధంపై ఆర్టీసీ RM అప్పలనాయుడు స్పందించారు. కూర్మన్న పాలెం నుంచి వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగిందన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్పష్టం చేశారు. ప్రమాదన్ని గుర్తించిన బస్సు సిబ్బంది వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారని తెలిపారు. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.