TG: అమీర్‌పేట్ మైత్రీవనంలోని ఓ అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పలువురు విద్యార్థులు ఈ మంటల్లో చిక్కుకోవడంతో అక్కడ ఉన్న యువకులు, పోలీసులు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్‌లో భారీ ఆన్‌లైన్ గేమింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీల్లో ఈ మాఫియా గుట్టురట్టు అయ్యింది. సిండికేట్‌తో ఈ ముఠా రూ.13 వేల కోట్ల మోసానికి పాల్పడినట్లు సోదాల్లో వెల్లడైంది. ఫేక్ కేవైపీతో షెల్ కంపెనీల ఆన్‌బోర్డింగ్ చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
MP బుర్హాన్పూర్‌లో 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష జరుగుతుండగా, ఓ టీచర్ ఏకంగా ప్రశ్నపత్రాన్ని తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టింది. విద్యార్థులు కాపీ కొట్టేందుకు ఆమె ఈ పని చేసినట్లు తేలింది. దీనిపై సీరియస్ అయిన అధికారులు ఆ ఉపాధ్యాయురాలితో పాటు పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్‌లను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
TG: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. కుటుంబకలహాల కారణంగా ముగ్గురిపై కత్తితో దాడి జరిగింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబీకులు సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై రామ్‌దూత్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో వారికి తీవ్రంగా గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: HYDలోని అమీన్ పూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండున్నర కిలోల OPM డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న.. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్నారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
TG: HYD బాలాపూర్‌లో ముగ్గురు వ్యక్తులపై దాడి జరిగింది. 20 మంది దుండగులు వచ్చి ముగ్గురిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: ఐ.పోలవరం మండలం ఎదుర్లంక చెక్ పోస్ట్ వద్ద యానాం నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 790 లీటర్ల డీజిల్, 80 లీటర్ల పెట్రోల్‌ను బుధవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రవీంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, రాంబాబులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
KMM: రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను బుధవారం హైదరాబాద్ సెక్రటేరియట్ నందు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం జిల్లాలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన రూ. 5 కోట్ల నిధుల జీవో త్వరగా వచ్చేందుకు అన్ని విధాలుగా సహకరించిన సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.