ATP: యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన 15 ఏళ్ల రాకేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తెల్లవారుజామున గ్రామంలోని మెకానిక్ జాఫర్ షాప్ వద్ద అతను విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సత్యసాయి: చిలమత్తూరు మండలంలోని లాల్లేపల్లి గ్రామ సమీపంలో సోమశేఖర్ రెడ్డి (38) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. కొంతకాలంగా మృతుడు సోమందేపల్లిలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో తన స్వగ్రామమైన లాలేపల్లి వద్ద ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటననపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ASF: తిర్యాణి మండలంలోని పంగిడి మాదరా గిరిజన ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఆత్రం అనురాగ్ అనే విద్యార్థి విష జ్వరంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజులు తిర్యాణి ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి నిన్న మృతి చెందినట్లు తెలిపారు.
TG: మెహిదీపట్నం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. బస్సు మరమ్మతు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
KKD: గొల్లప్రోలు నగర పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్ బోల్తాపడడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. గొల్లప్రోలు వాటర్ హౌస్ నుంచి కొత్త కాలనీకి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. రోడ్లు బురదగా ఉండడంతో వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
E.G: రాజమండ్రిలోని ఆల్కాట్ తోటలలో పోలీసులకు రాబడిన ముందస్తు సమచారం మేరకు టూ టౌన్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన మింది గణేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు అతడి వద్ద సుమారు రూ. 8 వేలు విలువైన 45 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ATP: పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్ద వినాయక మండపానికి డెకరేషన్ లైట్స్ ఏర్పాటు చేస్తుండగా పసుపులేటి రాజేశ్ అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తాడిపత్రిలో ఇంటర్ చదువుతున్న రాజేశ్ పండగ కోసం ఇంటికి వచ్చిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
MLG: మల్లంపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపల్లికి చెందిన ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా టాటా ఏసీ ట్రాలీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TG: మహబూబ్ నగర్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. రేబిస్ వ్యాధితో బాధపడుతున్న యశోద అనే మహిళ తన మూడేళ్ల కూతురిని ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే రేబిస్ వ్యాధి కారణంగా ఆమె మానసిక స్థితిని కోల్పోయి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: మహబూబ్ నగర్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. రేబిస్ వ్యాధితో బాధపడుతున్న యశోద అనే మహిళ తన మూడేళ్ల కూతురిని ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే రేబిస్ వ్యాధి కారణంగా ఆమె మానసిక స్థితిని కోల్పోయి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
RR: నాగోల్‌లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్డేపల్లి చందు, కన్నెబోయిన జ్ఞానేశ్వర్లను పట్టుకుని వారి వద్ద నుంచి నాలుగు దొంగిలించిన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మమతానగర్‌లో జరిగిన బైక్ చోరీపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
SRCL: డెంగ్యూ జ్వరంతో చిన్నారి మృతి చెందిన ఘటన తంగళ్ళపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇంద్రనగర్‌కు చెందిన సారుగు బాలయ్య–సంధ్య దంపతుల కుమార్తె సహస్ర(8) మూడు రోజుల క్రితం అనారోగ్యంతో సిరిసిల్లలోని ఆస్పత్రిలో చేరగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ డెంగ్యూ నిర్ధారణ కాగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది.
NTR: విజయవాడ ప్రధాన రహదారి అయిన బందర్ రోడ్డులో ఉదయం సాయంత్రం వేళల్లో సకాలంలో సరిపడా బస్సులు లేక విద్యార్థులు నిత్యం నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులలో నిత్యం నరకం చవిచూస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఫుట్ బోర్డులో వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం కొనసాగిస్తున్నారు.
SKLM: పాతపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో రూర్కెలా నుంచి గుణుపూర్ వెళ్తున్న రాజా రమణి ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం సుమారు పది గొర్రెలను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. గతంలో కూడా అనేకసార్లు రైల్ ట్రాక్ పక్కనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కాపరదారులు రైల్వే ట్రాక్ దూరంగా మూగజీవాలకు పెంచుకోవాలని సూచించినా పట్టించుకోవడంలేదని పోలీసులు అంటున్నారు.
SRD: కంది మండలం చేర్యాల జాతీయ రహదారిపై 122.85 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేర్యాల గేటు వద్ద తనిఖీలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు టాటా ఇండికాలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.