TG: మొగిలయ్య(70) అనే వ్యక్తి తన మరదలు(50) నరికి చంపిన ఘటన హన్మకొండ జిల్లా హాసన్‌పర్తిలో జరిగింది. భార్య చనిపోవడంతో మొగిలయ్య తన మరదలితో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య నెలకొన్న ఘర్షణ అతడి మరదలు చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: HYDలోని దుండిగల్ బౌరంపేటలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ కసాయి తల్లి రెండు నెలల బాలుడిని కట్టెల పొయ్యిలో వేసి చంపింది. ఆ చిన్నారి అరుపులు ఎవరికీ వినపడకూడదని నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసింది. ఈ ఘటనసై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ చిన్నారిని చంపడానికి గల కారణం ఏంటనేది తెలియరాలేదు.
AP: అనంతపురంలో ఫేస్‌బుక్ పోస్టులతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఓ కానిస్టేబుల్ భార్య ఫేస్‌బుక్‌లో కొన్ని పోస్టులు చేశారు. ఆమె పోస్టుల కింద మరో కానిస్టేబుల్ అసభ్య మెసేజ్‌లు పెట్టాడు. వీటిని భర్త చూడడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. అనంతరం భార్యతో భర్త ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనతో ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
TG: హైదరాబాద్ అంబర్ పేటలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామ్ రాజ్(55), మాదవి(50), శశాంక్(21) ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
TG: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిదిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి చెట్టును కారు ఢీ కొట్టగా.. నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ప్రమాదంలో కారు డ్రైవర్, ఇద్దరు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
AP: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త కొడవలితో నరికాడు. తీవ్రగాయంతో ప్రభుత్వ ఆస్పత్రిలో భార్య గౌరమ్మ చికిత్స పొందుతోంది. అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతూరు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యపై దాడి చేసిన భర్త నాగభూషణం పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
JGL: గొల్లపల్లి మండలం బీబీ రాజు పల్లె గ్రామంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడడంతో లంబడిపల్లెకు చెందిన డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
TG: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్‌లో సాయి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సాయి తన పైన చేతబడి చేశాడని నిందితుడు బాలు హత్య చేసినట్లు సమాచారం. అతణ్ని హత్య చేసిన తర్వాత నిందితుడు రోడ్డుపైనే నిల్చున్నాడు.
AP: కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ACB అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ కేసు విషయంలో ఎస్సై అనిల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. టూవీలర్ కన్సల్టెన్సీ యజమానిని రూ.4 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో ఎస్సై అనిల్‌తో పాటు సీఐ వెంటరమణను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
చెన్నైలో జరిగిన బీచ్ ప్రమాదంలో ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రకు చెందిన గోల్డెన్ బీచ్ వద్ద సెల్ఫీలు తీసుకుంటుండగా ఒక్కసారిగా 15 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. దీంతో ముగ్గురు కొట్టుకుపోయారు. అయితే, వారిలో ఒకరు సురక్షితంగా బయటపడగా.. మరొకరు గల్లంతయ్యారు. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టినట్లు మహారాష్ట్ర సీఎంవో ప్రకటించింది.
TG: హైదరాబాద్ బంజారాహిల్స్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ర్యాపిడో బైక్‌ను వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు సయ్యద్ హుస్సేన్, అక్షిత మృతి చెందారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ హోంగార్డుగా సయ్యద్ పనిచేస్తున్నారు. ఉద్యోగం తర్వాత పార్ట్ టైంగా ర్యాపిడో డ్రైవర్‌గా చేస్తున్నారు. ర్యాపిడో కస్టమర్ అక్షిత కూడా ప్రాణాలు కోల్పోయింది.
KKD: తునిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీరామ థియేటర్ సెంటర్లో బుధవారం జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సైకిల్ మెకానిక్ నానాజీ సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ మెకానిక్, సైకిల్ మెకానిక్ మధ్య జరిగిన ఘర్షణ ఆగ్రహానికి లోనైన బైక్ మెకానిక్, నానాజీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం తొగరపాయ వంతెన వద్ద సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న అయినవిల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో కొలపర్తి అచ్యుత లోకేశ్వరరావు, పి.శ్రీనివాసరావులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
AP: కృష్ణా జిల్లా పామర్రు మండలం డీపీగూడెంలో దారుణం జరిగింది. తండ్రిని కొడుకు మహేష్ కత్తితో పొడిచి చంపాడు. వేడినీళ్ల విషయంలో తండ్రి మందలించాడని ఘాతుకానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ATP: నార్పలలోని సుల్తాన్‌పేట పెట్రోల్ బంకు వద్ద దొంగలు బరితెగించారు. వడ్డే మహేష్ అనే వ్యక్తికి చెందిన బొలెరో వాహనానికి ఉన్న రూ. 45 వేల విలువైన రెండు టైర్లను అపహరించారు. నాలుగు నెలల వ్యవధిలోనే రెండోసారి ఇలా జరగడంతో బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. పోలీసులు గస్తీ పెంచి నిందితులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.