MHBD: మరిపెడ మండలంలోని యల్లంపేట స్టేజీ వద్ద గురువారం భూక్య వెంకన్న (35) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే వెంకన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామ పంచాయితీ వీధివారి లంకకు చెందిన పల్లిచిట్టయ్య (65) తాతపూడి లంకకు వెళ్లాడు. అయితే తిరిగి రాకపోవడంతో లంకలోకి వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ దొరరాజు ఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సహాయంతో గోదావరిలో గాలిస్తున్నారు.
SRPT: కోదాడ మండలం రెడ్లకుంటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేష్ (20) గురువారం తెల్లావారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేష్ ఇంటికి వచ్చిన అతని అమ్మమ్మ చూసి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలోనే రాజేష్ మృతి చెందాడు.
ATP: తాడిపత్రి రూరల్ మండలంలో టిప్పర్ బోల్తా పడింది. మండల పరిధిలోని ఇగుడూరు-సీతారామపురం మధ్య జాతీయ రహదారిపై వెళ్తున్న ఇసుక టిప్పర్ ప్రమాదవశాత్తు కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో యాడికి మండలం గుడిపాడుకు చెందిన టిప్పర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పలు పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఛండీగఢ్-కులూ జాతీయ రహదారిపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీని వల్ల ఢిల్లీకి పండ్లు, కూరగాయలు తరలిస్తున్న లారీలు నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్ వల్ల సాధారణ ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఆ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
NRPT: మద్దూరు మండల కేంద్రంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదావశాత్తు ఇంటి పక్కనే నిలిచిపోయిన వర్షపు నీటి గుంతలో పడి ఐదేళ్ల భరత్ కుమార్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కోస్గి మండలం ముంగిమల్ల గ్రామానికి చెందిన మొగులయ్య, అనంత దంపతులు మద్దూరులో ఫెర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నారు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న భరత్ గుంతలో పడటంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్లో వర్షాల కారణంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య 310కి చేరింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(SDMA) నివేదిక ప్రకారం, వరదల వల్ల 158 మంది చనిపోగా, కొండచరియలు విరిగిపడి 152 మంది మరణించారు. జూన్ 20 నుంచి ఇప్పటివరకు 369 మంది గాయపడ్డారు, 38 మంది గల్లంతయ్యారు. వరదల వల్ల కలిగిన నష్టం రూ. 2,623 కోట్లు దాటింది. 1,852 పశువులు, 25,755 కోళ్లు కూడా మృత్యువాతపడ్డాయి.
SRD: చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్చెరు మండలం చిట్కుల్లో చోటు చేసుకుంది. గురువారం స్థానికులు తెలిపిన వివరాలు.. ముత్తంగికి చెందిన జాకోబ్ అనే వ్యక్తి స్థానిక మల్లన్న గుడి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికు తెలిపారు. ఈ ఘనటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలోని విరార్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భవనం కూలి 15మంది మృతి చెందారు. మరో 9మందికి గాయాలు కాగా.. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో భవన యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
GDWL: APలో ఇసుక తరలింపు అనుమతులు తీసుకుని, తెలంగాణలోకి అక్రమంగా తరలించి విక్రయిస్తున్న ముఠాను మానవపాడు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రి నుంచి వే బిల్లుల సహాయంతో ఇసుకను తరలిస్తూ HYD వైపు తీసుకెళ్తుండగా అడ్డుకుని రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. APలో పర్మిషన్ తీసుకుని తెలంగాణలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విచారణలో తేలింది.
KKD: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని బాలుడు మృతి చెందిని ఘటన బుధవారం తునిలో చోటు చేసుకుంది. తుని రైల్వే గేటు నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు తాండవ రైల్వే బ్రిడ్జి దాటుతుండగా గుర్తు తెలియని బాలుడి(13)ని వైజాగ్ నుంచి వచ్చే రైలు ఢీ కొట్టడంతో బాలుడు మరణించాడు. బాలుడు నలుపు రంగు షర్టు ధరించి ఉన్నాడని తుని జీఆర్పీ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
TG: హైదరాబాద్లోని అమీర్పేట్లో బాలాజీ నెయ్యి తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా వ్యాపించడంతో పొగ దట్టంగా కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దుకాణంలో ఎంతమంది ఉన్నారనే సమాచారం తెలియలేదు. పక్కన ఉన్న షాపులోకి మంటలు వ్యాపించి అందులోని వస్తువులు ధ్వంసమయ్యాయి.
అమెరికాలో కాల్పుల కలకలం రేపింది. మిన్నెసోటా మినియాపొలిస్లో ఓ క్యాథలిక్ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. అందులో 14 మంది పిల్లలున్నట్లు తెలిపారు. విద్యార్థుల ప్రార్థన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చెప్పారు.
కడప నగరంలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బాలాజీ నగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విద్యుత్ షాక్కు గురై రాజారెడ్డి వీధికి చెందిన సుమతేజ(పండు) అక్కడకక్కడ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: కౌతాళం మండలం ఉరుకుందలో బుధవారం కరెంట్ షాక్కు గురై రెండు ఎద్దులు మృతి చెందాయి. అంతేకాక ఒక రైతు తీవ్రంగా గాయపడ్డాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన రైతు ఆంజనేయ ఎద్దుల బండితో ఐరన్ డబ్బాను తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలాయి. రూ.2 లక్షల విలువైన ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని గ్రామస్థులు ఆరోపించారు.