మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. టీవీలో క్రైం షోలు చూసి ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. గ్వాలియర్‌కు చెందిన ప్రదీప్ గుర్జార్ భార్యను చంపి మృతదేహాన్ని రోడ్డుపై పడేశాడు. రోడ్డు ప్రమాదంలో తనకు కూడా గాయాలైనట్లు పోలీసులకు చూపించాడు. అయితే, మహిళను చిత్రహింసలకు గురిచేయటంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.
GNTR: అమెరికా నార్త్ కెరోలినాలో నివాసం ఉంటున్న తెనాలికి చెందిన ఎన్నారై కుటుంబంలో ఇద్దరు చిన్నారులు నేడు మృతి చెందారు. తెనాలి అయితానగర్‌కు చెందిన గడ్డం థామస్ కుమార్తె షారోన్ సధానియేల్‌కు, అమెరికాకు చెందిన సథానియేల్ లివిస్కాతో 2007లో వివాహం కాగా అమెరికాలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భారీ వృక్షం కూలి వీరి ఇంటిపై పడటంతో చిన్నారులు మృతి చెందారు.
ELR: గణపవరంలో నాటు తుపాకీల వ్యవహారం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. సమాచారం అందుకున్న ఎస్సై మణికుమార్ నాటు తుపాకీలు సోమవారం స్వాధీన పరుచుకున్నారు. గోపి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. లైసెన్స్ లేకుండా ప్రజాశాంతికి భంగం కలిగేలా తుపాకీలను వినియోగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ATP: రాయదుర్గం పట్టణంలో గుర్తుతెలియని దుండగులు అడవికి గత అర్ధరాత్రి నిప్పు పెట్టారు. ఎకరానికి పైగా వృక్ష సంపద అగ్నికి ఆహుతి అయింది. పట్టణంలో పది రోజుల క్రితం శాంతినగర్ కొండకు, కనేకల్ రోడ్డులో కొండకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి అటవీ వృక్ష సంపదను హరించి వేశారు. దీంతో పశువులకు కొండపై మేత లేకుండా చేస్తున్నారని పశుకాపదారులు వాపోతున్నారు.
MHBD: గూడూరు మండలం బొద్దుగొండ సమీపంలోనున్న గండి తండ వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూపతిపేట సబ్ స్టేషన్లో విధులు ముగించుకొని తిరిగీ ఇంటికి వస్తుండగా తండా యకాస్వామి తలపై నుంచి దూసుకెళ్లిన గుర్తుతెలియని వాహనం. మృతుడుది తొర్రూర్ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు నమోదు చేసినట్లు తెలిపారు.
KMR: జాతీయ రహదారి 161లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగ్ రావు పల్లి నుంచి పిట్లం వైపు బైకుపై వెళ్తున్న క్రమంలో మరో బైక్ వెనక నుంచి ఢీ కొట్టిందని హైవే సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో నర్సింగ్ రావుపల్లి గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్‌కి గాయాలు కాగా అంబులెన్స్‌లో పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హైవే సిబ్బంది తెలిపారు.
TPT: తిరుమల నుండి హైదరాబాద్ వెళుతున్న ఓ కారు పంపలేరు జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొంది. డివైడర్‌ను ఢీకొన్న కారు బోల్తాపడగా అందులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.
GNTR: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నాజ్ సెంటర్లో ఓ లాడ్జిపై నుంచి పడి వృద్ధుడు మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వెంటనే లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చూరీకి తరలించారు. కాలు జారి పడ్డాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ATP: నార్పల మండల కేంద్రంలో ఆదివారం కవిత అనే వివాహిత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
NZB: నిజామాబాద్‌లోని బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం కారు సైకిల్‌ను ఢీకొన్న ఘటన తెలిసిందే.. ఈ ఘటనలో సైకిల్ నడుపుతున్న చంద్రశేఖర్ కాలనీకి చెందిన సయ్యద్ షాహిజాద్ (11) తీవ్ర గాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. కాగా, ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ATP: ఉరవకొండ మండలం చిన్నముష్టూరు వద్ద 42వ నంబర్ హైవే పై ఆదివారం టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారంతా బొమ్మనహాల్ మండలం ఆరేసముద్రం నుంచి ఉరవకొండ మండలం మోపిడి గ్రామానికి శ్రీమంతం కార్యక్రమానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
KMM: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటన మధిర మండలంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర మండల కేంద్రంలోని శాంతి థియేటర్ సమీపంలో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాపట్ల: మండల పరిధిలోని అప్పికట్ల హిందుస్థాన్ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండేన్ గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పొన్నూరు వైద్యశాలకు తరలించారు.
కృష్ణా: గుడివాడ మండలం దొండపాడు గ్రామంలోని సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ఘంట శ్రీనివాసరావు సూసైడ్ చేసుకున్నాడు. మల్లాయిపాలెం టిడ్కో ఇళ్ల సమీపంలో గల రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు మృతి పట్ల, ఉద్యోగులు భావోద్వేగానికి లోనయ్యారు. సూసైడ్‌కు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన 24 గంటల గడువు ముగిసిందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జాఫర్ ఎక్స్‌ప్రెస్ నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది సైనికులను చంపేశామని ప్రకటించింది. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించడంతో తమ చేతులకు పని చెప్పామని వ్యాఖ్యానించింది.