AP: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. మోహన్‌బాబు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిని భూమన ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వస్థలం అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని మంగళం గ్రామంగా గుర్తించారు. భూమన మృతదేహాన్ని రియా ఆసుపత్రికి తరలించారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని.. హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.