SRD: కంది మండలం చేర్యాల జాతీయ రహదారిపై 122.85 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేర్యాల గేటు వద్ద తనిఖీలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు టాటా ఇండికాలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
SKLM: కోటబొమ్మాళి మండలం వైశ్య వీధికి చెందిన చిన్న పిండి మిల్లు నడుపుతున్న మల్ల రమేశ్ (45) సోమవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. పిండి మిల్లుపై ఆధారపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ తరుణంలో మిల్లు స్టార్ట్ చేసిన సమయంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.
SKLM: జి.సిగడాం మండలం వాడ్రంగి గ్రామ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షంలో రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు యాచకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో యాచకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
మెదక్ మండలం మాచవరంలో ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. సొంగ లక్ష్మయ్య, అంజమ్మల కుమారుడు సొంగ కుమార్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇవాళ వ్యవసాయ పనుల నిమిత్తం వారు వెళ్లగా ఇల్లుకు నిప్పంటుకున్న సంగతి తెలిసి ఇంటికి వచ్చే సరికి మొత్తం కాలిపోయింది. ఇంట్లో ఉన్న రూ.3.70 లక్షలు, పాస్ బుక్స్, 40 తులాల వెండి, సామాగ్రి పూర్తిగా కాలిపోయాయని బాధితులు తెలిపారు.
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్ వద్ద తండ్రి, కుమార్తెను రెడిమిక్స్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన లారీ డ్రైవర్ ప్రదీప్ రమనిక్ (55) మృతి చెందాడు. టైరు మారుస్తున్న సమయంలో మరో లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: వెలిగండ గ్రామ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రాళ్లపల్లి గ్రామానికి చెందిన పాలపర్తి రవి, మరొక వ్యక్తి ద్విచక్ర వాహనంపై మొగులూరు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా కనిగిరి భారత్ గ్యాస్ వాహనం ఎదురుగా ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనం పైన ఉన్న వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని హుటహుటిన కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
VZM: కొత్తవలస రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు ఎస్సై బాలాజీరావు సోమవారం తెలిపారు. మృతుని వయస్సు సుమారు 30-35 ఉంటుందన్నారు. ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్ టీ షర్ట్, లైట్ కలర్ గ్రే కలర్ లోయర్ ధరించినట్లు చెప్పారు. చామన చాయ రంగు, 5 అడుగుల 6 అంగుళాలు ఉన్నట్లు తెలిపారు. ఆ చూకి తెలిసినవారు 9490617089 సంప్రదించాలని కోరారు.
MNCL: మందమర్రి మార్కెట్ ఫ్లై ఓవర్ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు(65) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు రైల్వే కానిస్టేబుల్ సురేష్ సోమవారం ప్రకటనలో తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో భద్రపరిచామన్నారు. ఎవరైనా గుర్తుపడితే రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
RR: డ్రగ్స్ కేసులో రాజమహేంద్రవరం డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని అపార్ట్ మెంట్లో బర్త్ డే పార్టీలో యువకులు డ్రగ్స్ సేవిస్తుండగా.. డీప్యూటీ తహసీల్దార్ సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కీలక నిందితులు విక్రమ్ రెడ్డితో పాటు మరో ఇద్దరు యువతులు ఉన్నట్లు గుర్తించారు. 20గ్రా.ల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
NTR: విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద పడి గాయాలపాలయ్యారు. కాగా ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని స్థానిక ట్రాఫిక్ ఎస్సై బేగ్ తెలిపారు. స్వల్ప గాయాలపాలైన వారిని స్థానికులు వైద్య నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
VSP: భీమిలిలో ఆదివారం ఓ దారుణ ఘటన చేటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ తన ఇంట్లో ఉన్న అన్న కుమార్తె (13)పై మద్యం మత్తులో అత్యాచారం చేశాడు. బాలికకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ACP అప్పలరాజు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు.
సత్యసాయి: గోరంట్ల మండలం కమ్మవారిపల్లిలో పంచాయతీ సెక్రటరీ ఫరూక్ అబ్దుల్లా, ఇంజినీరింగ్ అసిస్టెంట్ బాలాజీ ఇద్దరూ కొట్టుకున్నారు. పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ అసిస్టెంట్‌తో కలిసి సోమవారం కమ్మవారిపల్లి ఎస్సీ కాలనీలో సర్వే చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో మాటమాట పెరగ్గా బాలాజీ తనను కింద పడేసి కొట్టడంతో చేయి విరిగినట్లు తెలిపారు.
MDK: కౌడిపల్లి మండలం ఎల్లమ్మ దేవాలయ సమీపంలో రోడ్ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో హవేలీ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కొండ నరేష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై మెదక్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో దారుణం జరిగింది. భార్య శ్రావణిని భర్త శ్రీశైలం దారుణంగా హత్య చేశారు. భార్య శ్రావణిపై అనుమానంతో కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సోమశిల వెళదామని చెప్పి భార్యను తీసుకెళ్లిన శ్రీశైలం.. మార్గం మధ్యలో ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.