SKLM: మందస మండలం లోహరిబంధ గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మధ్యాహ్న భోజనం అనంతరం సమీపంలో ఉన్న జీడీ తోటలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: పెద్దాపురంలో లలిత ఇండస్ట్రీస్‌లో జట్టు కార్మికుడు మంగళవారం స్నానం చేస్తూ బాత్ రూంలో మృతి చెందాడు. మృతుడు బిహార్ షబ్బీర్ ఆలం(34)గా గుర్తించారు. పచ్చకామర్లతో అనారోగ్యంగా ఉన్నాడని తోటి కార్మికులు తెలిపారు. మృతదేహాన్ని పెద్దాపురం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పెద్దాపురం పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KMM: అప్పు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన గిరిజన కౌలు రైతు నేరుశుల ఎల్లయ్య అప్పు బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు
KDP: రాజుపాలెం మండలంలో మిస్సింగ్ కేసు నమోదైంది. కొర్రపాడు గ్రామానికి చెందిన దద్దనాల జమీల అనే మహిళ, ఆమె పిల్లలు కమాల్ బాషా (8), మదియా (6) ఆదివారం నుంచి కనపడకుండా పోయారని రాజుపాలెం ఎస్ఐ కత్తి వెంకట రమణ తెలిపారు. ఈ విషయమై రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు 91211 00600 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
NDL: పట్టణంలోని చిన్నచెరువు వద్ద ఉన్న వినాయక ఘాట్‌లో యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బిల్లలపురంకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చరణ్(25)గా గుర్తించారు. ఆత్మహత్య లేదా ఇతర కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
VZM: వంట గ్యాస్ లీకై ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కొత్తవలస మండలంలో చోటు చేసుకుంది. కంటకాపల్లిలో సోమవారం జరిగిన అమ్మవారి తీర్థ మహోత్సవాలు సందర్భంగా బాడితబోని మల్లయ్య ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని శారదా కంపెనీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ATP: గుంతకల్లు పట్టణ శివారులో సోమవారం రైలు కిందపడి ఓ గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
SRD: కోహిర్ మండలం గోటియర్ పల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అర్జున్ పవన్, శంకర్ కోహిర్ మండలంలోని ఓ విందుకు వెళ్లారు. సిద్దాపూర్ తాండాలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి శంకర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
BHNG: చౌటుప్పల్ మండలం రెడ్డి బావి గ్రామ సమీపంలో అక్రమంగా 9 ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పశువులను, వాహనాన్ని స్థానిక పోలీసులకు అప్ప చెప్పారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పారు. ఈ ఘటనపై వాహనం సీజ్ చేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
MBNR: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై శివనాగేశ్వర్నాయుడు తెలిపిన వివరాలు.. తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కి చెందిన సోప్పరి రాఘవేందర్ మిడ్జిల్ మండలం చిల్వేర్‌లో పెళ్లికి వెళ్లి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు.
సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులో మహిళపై శనివారం రాత్రి అత్యాచారం జరిగింది. అల్లాదుర్గం మండలానికి చెందిన గిరిజన దంపతులు అనంతపురం జిల్లా నేరేడుగొండలోని సేవాలాల్ దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. ఫసల్వాది సమీపంలోకి రాగానే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకున్న భర్తపై దాడి చేశారు.
VKB: గత ప్రభుత్వ నిర్మాణ పనుల బిల్లులు రాక తీవ్ర మనస్తాపానికి గురైన బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ చింతకింది వెంకటప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే అతడిని వికారాబాద్ పట్టణంలోని మిషన్ ఆసుపత్రికి తరలించారు.
JGL: MPలోని రేవా ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన వెంగళ ప్రమీల(58) మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి రెండు కార్లలో ఉత్తరప్రదేశ్ కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఒక కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రమీల అనే మహిళ మృతి చెందింది. ఇటీవలనే ఆమె భర్త గుండెపోటుతో మృతి చెందగా.. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
NLR: సీతారాంపురం మండలం పడమటి రొంపిదొడ్ల గ్రామానికి చెందిన ముట్టుకుందు చెన్నమ్మ (75) మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఇంటి సమీపంలోని పొలం వద్ద పురుగు మందు తాగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఉదయగిరి ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలో మృతి చెందింది.
JGL: మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ శివారులోని చెరువు వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్, బైక్ ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ముద్దంగుల కిష్టయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.