JGL: జిల్లా కేంద్రంలోని సబ్ జైలులో ఖైదీ క్యాతం మల్లేశం (43) గుండెపోటుతో గురువారం ఉదయం మృతి చెందినట్లు జైలు అధికారులు ప్రకటించారు. మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో సబ్ జైలు నుంచి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు.
ముంబై తీరంలో జరిగిన ఘోర ప్రమాదంలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే, ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సీఎం సహాయనిధి నుంచి పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. పీఎం సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.
KRNL: ఆదోనిలోని నాటుసారా, మట్కా నిర్వాహకులపై సిబ్బందితో కలిసి వన్ టౌన్ సీఐ కే.శ్రీరామ్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2,000 లీటర్ల బెల్లం ఊట, 110 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. రూ.లక్ష మట్కా డబ్బులు స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
VZM: గుంతల కారణంగా బైక్‌పై నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బొబ్బిలి సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సీతానగరం మండలం చిన్నబోగిలి గ్రామానికి చెందిన దుప్పాడ ఉషారాణిగా గుర్తించారు. సంఘటన స్థలం వద్దకు పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
NLR: సంగం మండలం పెరమన వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు వైపు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న సిమెంట్ లారీ.. బద్వేల్ వైపు నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని వెంటనే 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
GNTR: తాడేపల్లిలో ఈతకు దిగి వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. సీతానగరం కృష్ణా నదిలో కానూరుకు చెందిన రామకృష్ణ ఈతకు దిగి మరణించినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP: కడపలో ఘోర ప్రమాదం తప్పింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేలుడు దాటికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
15 ఏళ్ల క్రితం ఓ వైద్యుడు రూ.400 లంచం తీసుకున్నాడు. దీనికి అతనికి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన ఓ వైద్యుడు మెడికల్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు 15 ఏళ్ల క్రితం రూ.400 లంచం తీసుకున్నాడు. ఈ కేసులో అతన్ని దోషిగా తేల్చిన కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధించి...
AP: ఏపీ, కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్‌లను కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఐదుగురు మృతిచెందారు. పుంగనూరు పరిధి గుడిపల్లి సమీపంలో ఘటన సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: ఫోక్ సింగర్ శృతి అనుమానాస్పదంగా మృతి చెందింది. శృతి మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అత్తింటివారే హత్యచేశారని మృతురాలి బంధువులు ఆరోపణలు చేశారు. 20 రోజుల ముందు దయాకర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. సోషల్ మీడియా ద్వారా శృతికి దయాకర్ పరిచయమైనట్లు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ శృతి స్వస్థలం. ఘటన జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లిలో జరిగింది.
కృష్ణా: కానూరుకు చెందిన వ్యక్తి తాడేపల్లిలో ఈతకు వెళ్లి వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. సీతానగరం కృష్ణా నదిలో రామకృష్ణ ఈతకు దిగి మరణించినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొని అంగన్వాడీ టీచర్ గాయపడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. అంగన్వాడీ టీచర్ నాగలక్ష్మి పాఠశాల నుంచి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ముంబైలో బోటు ప్రమాదం జరిగింది. సముద్రంలో పర్యాటక బోటును స్పీడ్ బోటు ఢీకొట్టింది. బోటు మునిగి 13 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో 114 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. రెస్క్యూ టీమ్ 101 మందిని రక్షించింది. ఎలిఫెంటా కేవ్స్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాగా బోటు ప్రమాదంపై సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
SRCL: రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ముందు బుధవారం రెండు ద్విచక్రవాహనలు ఢీకొన్నాయి. దీంతో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయాలపాలైన వ్యక్తులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. రుద్రంగికి చెందిన కంటే రాములుకు తీవ్రగాయాలు కావడంతో రక్తస్రావం ఎక్కువై మార్గమధ్యంలో మృతి చెందాడు.
KMR: బిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర నగర్ గ్రామం వద్దగల NH-44పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్వాపూర్ గ్రామానికి చెందిన గుడ్డెంగారి సిద్దవ్వ మృతి చెందింది. ప్రముఖ MSN ఫార్మా కంపెనీకి చెందిన బస్సు ఢీకొట్టడంతో సిద్దవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇదివరకే భర్త చనిపోవడంతో కూలీపనులు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తు ఉన్నది.