KMR: బిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర నగర్ గ్రామం వద్దగల NH-44పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్వాపూర్ గ్రామానికి చెందిన గుడ్డెంగారి సిద్దవ్వ మృతి చెందింది. ప్రముఖ MSN ఫార్మా కంపెనీకి చెందిన బస్సు ఢీకొట్టడంతో సిద్దవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇదివరకే భర్త చనిపోవడంతో కూలీపనులు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తు ఉన్నది.
AP: పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నారాయణరెడ్డి (ఏ-3), రేఖమయ్య (ఏ-4), రంగనాయకులు (ఏ-5), వడ్డే కొండ (ఏ-6), ఓబిరెడ్డి (ఏ-8)కి బెయిల్ వచ్చింది. అనంతపురం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న పరిటాల రవి హత్య జరిగిన విషయం తెలిసిందే.
ముంబై సముద్ర తీరంలో బోటు మునిగిపోయింది. ఎలిఫెంటా దీవికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బోటులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రక్షణ సిబ్బంది.. బాధితులను కాపాడడానికి సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TG: గచ్చిబౌలిలో నిత్య పెళ్లి కొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు 50 మంది యువతులను మోసం చేసిన విగ్గురాజు వంశీకృష్ణ మ్యాట్రిమోనిల్లో విగ్గులతో ఫొటోలు పెట్టి పెళ్లి ప్రకటనలు ఇస్తున్నాడు. తాజాగా డాక్టర్ సంబంధం కుదుర్చుకుని యువతి తండ్రి నుంచి రూ.40 లక్షలు వసూలు చేశాడు. మోసాన్ని గుర్తించి పీఎస్‌లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. డబ్బులు అడిగితే మహిళా డాక్టర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి బ...
AP: సినీ ఫక్కీలో బంగారం షోరూమ్‌లో చోరీ జరిగిన ఘటన కాకినాడలో జరిగింది. షోరూంలోకి సైలెంట్‌గా వచ్చిన దుండగుడు ఉద్యోగిని గన్‌తో బెదిరించి బంగారం దోచుకెళ్లాడు. సిబ్బంది ఫిర్యాదుతో ట్రాఫిక్, కాకినాడ వన్ టౌన్ పోలీసులు నిమిషాల్లో ఛేదించారు. బంగారంతో పారిపోతున్న దొంగను ఛేజ్ చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే, డమ్మీ గన్‌ను గుర్తించారు.
RR: ఆన్ లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ (పెత్తుల్ల) గ్రామంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడ్డ లింగం(25) అప్పుల బాధ తాళలేక ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో ఉస్మానియ ఆసుపత్రిలో చేరిన అతడు 3 రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
NTR: జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద డివైడర్‌ను ఢీకొని కారు పల్టీ కొట్టింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని కారు పల్టీ కొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తులకు ఎటువంటి గాయాలు కాకపోవడంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
WGL: నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామంలో గత రాత్రి గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. గ్రామంలోని బెల్లం ఎంకన్న అనే రైతుకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడిచేయగా 5 గొర్రెలు మృతి చెందాయని వాపోయాడు. రూ.70 వేల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.
E.G: రాజవొమ్మంగిలోని శరభవారం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి కే.అఖిల్ వెంకట సాయి బూదరాళ్ల గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. లంబసింగి చూసేందుకు బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా ఘాట్ రోడ్డులో బైక్ బోల్తా కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. నర్సీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.
రాజస్థాన్ బికనేర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మందుగుండు సామగ్రి పేలి ఇద్దరు ట్రైనీ జవాన్లు దుర్మరణం చెందారు. వాహనంలోకి మందుగుండు సామగ్రిని ఎక్కిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: వనపర్తి జిల్లా పెబ్బేరు దగ్గర జాతీయ రహదారి 44పై దారి దోపిడీ జరిగింది. ఆగి ఉన్న కారుపై దొంగలు రాళ్లు, కర్రలతో దాడి చేసి కారులో ఉన్న మహిళల నుంచి 14 తులాల బంగారం చోరీ చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు జగిత్యాల జిల్లా కొత్తూరువాసులు కాగా, తిరుపతికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ...
ప్రకాశం: దర్శిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు దర్శి మార్కెట్ యార్డ్ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులు ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటన స్ధాలని చేరుకుని దర్యాప్తు చేశారు.
GDWL: జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో ట్రాక్టర్ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. బుధవారం అయిజ చిన్న తాండ్రపాడు చెరువులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ భాను తృటిలో తప్పించుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తమిళనాడులోని తేని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీలారీని అయ్యప్ప భక్తుల కారు ఢీకొట్టటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
శ్రీకాకుళం జిల్లాలో సైబర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా లోన్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ లింక్ వంటి వాటిపై ఫైబర్ నేరాలు శ్రీకాకుళంలో ఎక్కువగా నమోదవుతున్నాయని డీఐజీ బుధవారం తెలిపారు. ఎప్పటికీ దాదాపు 19 కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అనుమానం ఉన్న వ్యక్తులపై 1930కి ఫోన్ చేయాలని సూచించారు.