కూతురు పెళ్లి కోసం చేయించిన నగలతో తల్లి పారిపోయిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఒరాయ్లోని కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత తన కూతురు పెళ్లికి చేయించిన రూ. 2.50 లక్షల విలువైన నగలు, రూ.40 వేలు తీసుకొని వేరే వ్యక్తితో పారిపోయింది. అయితే తన వద్ద నుంచి భర్త నగలు తీసుకొచ్చాడు. అనంతరం తన భార్యను తీసుకెళ్లిన వ్యక్తి ఆమెను అమ్మెస్తానని బెదిరిస్తున్నాడని ఎలాగైనా తన భార్యను కాపాడాలని పోలీసులను ఆశ్రయించాడు.