WG: ఉండి మండలం యండగండిలో పార్శిల్లో డెడ్‌బాడీ మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. తులసి మరిది సిద్ధార్ధ వర్మే ప్రధాన సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అతడు డెడ్ బాడీ వచ్చినప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. డెడ్ బాడీ ఎవరిది, ఆ పార్శిల్ తెప్పించింది ఎవరు అనే విషయాలు తెలియాలంటే సిద్ధార్ధ వర్మ దొరకాలని ఎస్పీ నయిం పేర్కొన్నారు.