• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం

VSP: పరవాడ ఫార్మసిటీలోని విజయశ్రీ ఆర్గానిక్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు యూపీకి చెందిన NMR కార్మికుడు రాజు, పరవాడకు చెందిన ఆపరేటర్ సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి (59)గా గుర్తించారు. విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

December 7, 2024 / 10:53 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. బాలిక మృతి

HNK: పరకాల పట్టణంలో జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన వేముల సాత్విక (12) వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సాత్విక మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.

December 7, 2024 / 10:42 AM IST

BREAKING: ఢిల్లీలో కాల్పుల కలకలం

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. సునీల్ జైన్ అనే వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన ఫ్లోర్ మార్కెట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 7, 2024 / 10:26 AM IST

నాయుడుపేటలో ఇష్టా రాజ్యంగా ఇసుక అక్రమ తవ్వకాలు

NLR: నాయుడుపేట స్వర్ణముఖి నదిలో ఇష్ట రాజ్యాంగ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. తుమ్మూరు సమీపంలో స్వర్ణముఖి నదిలో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిల వద్ద భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లలో తరలించుపోతున్నారు.

December 7, 2024 / 10:17 AM IST

జిల్లాలో వరుస హత్యలు

KDP: కడప జిల్లాలో వారం వ్యవధిలో 4 హత్యలు జరిగాయి. నవంబర్ 30వతేదీన పులివెందులలో కొడుకును తండ్రి హత మార్చాడు. డిసెంబర్ 2న ప్రొద్దుటూరులో రౌడీషీటర్, అదే రోజు దువ్వూరులో మద్యానికి బానిసై వేధిస్తున్న కుమారుడిని తండ్రి రోకలిబండతో చంపాడు. నిన్న చక్రాయపేట మండలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరు కన్నుమూశారు. ఈ వరస ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

December 7, 2024 / 10:10 AM IST

MURDER CASE: యూట్యూబరే హంతకుడు

TG: వరంగల్ రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ హత్య కేసును పోలీసులు చేధించారు. యూట్యూబరే హంతకుడని తేల్చారు. అప్పు ఇవ్వలేదన్న కోపంతో కిరాతకంగా హత్య చేసినట్లు తెలిపారు. నిందితుడు మేనేజర్‌కు మద్యం తాగించి కర్రతో కొట్టిచంపాడు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లాడు. పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ములుగు జిల్లా కోమటిపల్లికి చెందిన శ్రీనుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 7, 2024 / 09:45 AM IST

ఇలా చేస్తే దొంగలు ఊరుకుంటారా?

విశాఖలోని RKనగర్ లేఔట్‌లో శుక్రవారం పట్టపగలు దొంగతనం జరిగింది. ఓలేటి ధనలక్ష్మి భర్త శ్రీనివాసరావు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఇంటికి లాక్ వేసి పూలకుండీలో తాళం ఉంచి ఆసుపత్రికి వెళ్లారు. దొంగలు ఇంట్లోకి చొరబడి సుమారు 5 తులాలకు పైగా బంగారం అపహరించుకుపోయారు. పిల్లలు పాఠశాల నుంచి వచ్చే సరికి తలుపులు తీసి ఉండటంతో దొంగతనం జరిగిందని గుర్తించారు.

December 7, 2024 / 09:20 AM IST

పోలీసుల ఆధీనంలో గ్రానైట్ లారీలు

ప్రకాశం: చీమకుర్తి నుంచి గ్రానైట్ రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు హైవేపై తనిఖీలు నిర్వహించామని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ చెప్పారు. సంతనూతలపాడు వద్ద 15 లారీలను నిలిపివేశామన్నారు. బిల్లులను నిర్ధారించేందుకు మైనింగ్ అధికారులకు లేఖ రాశామని చెప్పారు. వారు క్లీయరెన్స్ ఇస్తే లారీలను వదులుతామన్నారు.

December 7, 2024 / 08:20 AM IST

రెండు బస్సులు ఢీ.. 26 మంది మృతి

ఐవరీకోస్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు వేగంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందగా.. మరో 28 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. బ్రోకౌవా గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

December 7, 2024 / 08:01 AM IST

గూడ్స్ రైలులో పొగలు

TG: బొగ్గు లోడ్‌తో వెళ్తున్న ఓ గూడ్స్ రైలులో పొగలు వచ్చాయి. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రైలు బోగీలో పొగలు వచ్చాయి. అప్రమత్తమైన లోకో పైలెట్‌లు వంగపల్లి రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్టేషన్‌కు చేరుకుని బొగ్గు క్యాబిన్‌లోని పొగలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.

December 7, 2024 / 07:54 AM IST

RTC బస్సు ఢీకొని ఒకరి మృతి

విజయనగరం: శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. దత్తిరాజేరు మండలం పేదమానాపురంలో సంత జరిగింది. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వంగరకు చెందిన గెంజి మహేశ్, తిరండి నరసింహారావు, కొలుసు రమణ గొర్రెలతో సంతకు బయల్దేరారు. ఈ క్రమంలో పార్వతీపురం నుంచి విజయనగరం వెళ్తున్న RTC బస్సు వీరిని ఢీకొట్టింది.

December 7, 2024 / 07:49 AM IST

సంతమాగులూరులో ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ

ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ను పాల ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కరిముల్లాకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 7, 2024 / 07:37 AM IST

ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ

ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ను పాల ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కరిముల్లాకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 7, 2024 / 07:37 AM IST

విజయవాడ బిల్డింగ్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

కృష్ణా: విజయవాడలో బిల్డింగ్‌పై నుంచి పడి ఓ వ్యక్తి శుక్రవారం మృతిచెందాడు. కృష్ణలంక పోలీసుల వివరాల మేరకు.. చింతకాయల ప్రసాద్ అనే వ్యక్తి లారీడ్రైవర్‌గా పనిచేస్తూ ఉంటాడు. శుక్రవారం మద్యం మత్తులో మూడవ అంతస్తుపై నుంచి కింద పడి చనిపోయాడన్నారు. ఈ ఘటనపై తమ్ముడి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.

December 7, 2024 / 07:17 AM IST

గోపరాజుపల్లిలో ఘర్షణ.. ఒకరికి తీవ్రగాయాలు

కడప: పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లి గ్రామంలో నంద్యాల సుబ్బరాయుడు అలియాస్ సుబ్బయ్యపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి దాడి చేశాడు. గతంలో వీరి మధ్య పాత కక్షలు ఉండేవని దాని మనసులో పెట్టుకొని ఈ దాడి చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో గాయపడ్డ సుబ్బయ్యను చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

December 7, 2024 / 06:34 AM IST