MNCL: మందమర్రి పట్టణంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు SI రాజశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి ఏరియాకు చెందిన సంతోశ్ రోడ్డు దాటుతున్న క్రమంలో బెల్లంపల్లి వైపు వెళ్తున్న బైకు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు కూడా తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు.