బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినాస్ గెరియిస్లో శనివారం తెల్లవారుజామున బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. సావో పాలో ప్రాంతం నుంచి 45 మందితో వెళ్తున్న బస్సు మినాస్ గెరియిస్ వద్దకు రాగానే టైరు పేలింది. ఈ క్రమంలో ట్రక్కును ఢీ కొట్టినట్లు అధికారులు తెలిపారు.