NGKL: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై శనివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచార మేరకు వేగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడని అక్కడికక్కడే మృతి చెందాడని వెల్లడించారు.