కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడి 38 మంది మృతిచెందారు. ఈ ఘటనలో 100 మందికిపైగా గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. ఫెర్రీలో 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. వారంతా క్రిస్మస్ వేడుకలకు సొంతూళ్లకు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో 20 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.