AP: విశాఖ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్‌కు వచ్చిన తిరునెల్వేలి-పురులియా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తెగిపడిన విద్యుత్ తీగలను కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.