KDP : బద్వేలు- పోరుమామిళ్ల మార్గంలోని బి.కోడూరు మండలానికి వెళ్లే క్రాస్ రోడ్డులో వీధి దీపాల పనితీరు అస్తవ్యస్తంగా ఉంది. సమీపంలో సోలార్ దీపం ఏర్పాటు చేసినా, మరమ్మతులకు గురైంది. కనెక్షన్ లోపం వల్ల దీపాలు వెలుగుతూ.. ఆరిపోతున్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కో సందర్భంలో వీధి దీపాలు చోరీకి గురవుతున్నాయని వాపోయారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.